రూ. 11 లక్షల విలువైన గుట్కాలు పట్టివేత | quid worth rs 11 lakh worth seized | Sakshi
Sakshi News home page

రూ. 11 లక్షల విలువైన గుట్కాలు పట్టివేత

Mar 13 2015 12:11 PM | Updated on Sep 2 2017 10:47 PM

అక్రమంగా తరలిస్తున్న గుట్కా, ఖైనీల లోడును పోలీసులు పట్టుకున్నారు.

విజయనగరం : అక్రమంగా తరలిస్తున్న గుట్కా, ఖైనీల లోడును పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా బొమ్మలక్ష్మిపురం మండలంలో చోటు చేసుకుంది. వివరాలు..ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఓ లారీలో గంగాం జిల్లా నుంచి కొరాపూర్ జిల్లాకు గుట్కా, ఖైనీలను రాష్ట్రం గుండా అక్రమంగా తర లిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించగా గుట్కా లోడు బయటపడింది. అనంతరం లారీని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న లోడ్ విలువ దాదాపు రూ.11 లక్షలు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(బొమ్మలక్ష్మిపురం)

Advertisement
 
Advertisement
Advertisement