తొక్కిసలాటలో పుష్కర యూత్రికుడు మృతి | Pushkarini tourist killed in stampede | Sakshi
Sakshi News home page

తొక్కిసలాటలో పుష్కర యూత్రికుడు మృతి

Jul 20 2015 2:51 AM | Updated on Oct 1 2018 4:45 PM

తొక్కిసలాటలో పుష్కర యూత్రికుడు మృతి - Sakshi

తొక్కిసలాటలో పుష్కర యూత్రికుడు మృతి

గోదావరి రైల్వేస్టేషన్‌లో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఒక ప్రయాణికుడు మరణించాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం

♦ గోదావరి రైల్వేస్టేషన్‌లో ఘటన
♦ మృతుడి స్వగ్రామం దువ్వ
 
 కంబాలచెరువు (రాజమండ్రి)/తణుకు టౌన్ : గోదావరి రైల్వేస్టేషన్‌లో ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఒక ప్రయాణికుడు మరణించాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వకు చెందిన రైతు మేడిశెట్టి తాతారావు(45), భార్య రాఘవ, తల్లితో కలసి ఆదివారం వేకువ జామున గోదావరి రైల్వే స్టేషన్‌లో దిగారు. పుష్కర స్నానం ముగించుకుని ఉదయం 11 గంటలకు తిరిగి దువ్వ వెళ్లేందుకు గోదావరి రైల్వే స్టేషన్‌కు చేరారు. భీమవరం ప్యాసింజర్ రెండో నంబర్ ప్లాట్‌ఫాంపైకి వచ్చింది.

రైలు ఎక్కేందుకు ప్రయూణికులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. తాతారావు కిందపడిపోయాడు. ప్రయాణికులు అతడిని పక్కకు లాగి చూసేసరికి అపస్మారకస్థితికి వెళ్లిపోయాడు. వెంటనే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి తరలించారు. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement