'పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి' | pulse polio camp on sunday | Sakshi
Sakshi News home page

'పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

Jan 16 2016 5:00 PM | Updated on Sep 3 2017 3:45 PM

'పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

'పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

పోలియో మహమ్మారిని నిర్మూలించడానికి ఆదివారం(జనవరి 17) చేపట్టనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి విశ్వేశ్వరరెడ్డి కోరారు.

పగిడ్యాల (కర్నూలు జిల్లా) : పోలియో మహమ్మారిని నిర్మూలించడానికి ఆదివారం(జనవరి 17) చేపట్టనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి విశ్వేశ్వరరెడ్డి కోరారు. శనివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నుంచి గ్రామ పురవీధుల్లో  నినాదాలు చేయిస్తూ ర్యాలీ చేట్టారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. రోజుల నుంచి 5 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

బస్‌స్టాప్‌ల్లోను, ప్రధాన కూడళ్ల వద్ద, ఆరోగ్య ఉపకేంద్రాల వద్ద పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. అలాగే ఇతర గ్రామాల నుంచి పండుగకు వచ్చిన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించుకోవడం మరువరాదన్నారు. చుక్కలు వేయించడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదని, రియాక్షన్ రాదని వివరించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌ఎన్ పార్వతీ, ఏపీఎంవో నారాయణరావు, హెల్త్‌సూపర్‌వైజర్ కరీం, మెహరున్నీసా బేంగం, ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్లు, అంగన్‌వాడవీ కార్యకర్తలు తదితరులు పాల్గొనారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement