‘పరిష్కారం’తో సమస్యలకు చెల్లు | problems are not solved by Grievance program | Sakshi
Sakshi News home page

‘పరిష్కారం’తో సమస్యలకు చెల్లు

Sep 10 2014 2:14 AM | Updated on Sep 2 2017 1:07 PM

ప్రతి వారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి వందలాదిగా అర్జీలు వస్తుంటాయి. సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో పలువురు కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి.

నెల్లూరు(పొగతోట): ప్రతి వారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి వందలాదిగా అర్జీలు వస్తుంటాయి. సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో పలువురు కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అయి నా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా అర్జీలను బుట్టదాఖలు చేసేవారు. తేలికగా పరిష్కరించదగిన సమస్యకు సంబంధించిన అర్జీ కూడా సం బంధిత శాఖకు చేరేందుకు వారం రోజు లు పట్టేది.
 
ప్రజల వద్ద తాము సమర్పించిన అర్జీకి సంబంధించిన ఎలాంటి ఆధారం కూడా ఉండేది కాదు. సమస్య పరిష్కారం కోసం నెలల తరబడి ఎదురుచూసేవారు. ఇదంతా ఆరు నెలల కిందట పరిస్థితి. ఈ తిప్పలన్నింటికి ‘పరిష్కా రం’ ద్వారా కలెక్టర్ శ్రీకాంత్ చెక్‌పెట్టే ప్రయత్నం చేశారు. ఆరు నెలల పాటు శ్రమించి కాల్‌సెంటర్ ఇన్‌చార్జి యడ్ల నాగేశ్వరరావు సహకారంతో ఓ సాఫ్ట్‌వేర్‌ను ‘పరిష్కారం’ పేరుతో రూపొందిం చారు. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన కె.రాంగోపాల్ అమలు చేసిన పిటిషన్ మానిటరింగ్ సిస్టమ్(పీఎంఎస్)కు విభిన్నంగా దీనిని తీర్చిదిద్దారు. జూన్ నుంచి అమల్లోకి వచ్చిన పరిష్కారంలో భాగంగా కలెక్టరేట్‌లో 14 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
 
నివేశన స్థలాలు, పింఛన్, రుణాలు, భూమి, రెవెన్యూ తదితర సమస్యలకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటయ్యాయి. అర్జీతో పాటు ఫోన్ నంబ ర్, రేషన్, ఆధార్‌కార్డుల జెరాక్స్‌లు సమర్పించారు. వినతిపత్రం స్వీకరించి న వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి రసీదు ఇస్తారు. సమస్య పరిష్కారానికి ఏ అధికారిని సంప్రదించాలో దానిలో పేర్కొంటారు. అర్జీదారుని ఫోన్ నంబ ర్‌ను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటారు. సమ స్య పరిష్కారం ఎంత వరకు వచ్చిందనే విషయాన్ని అర్జీదారుడు ఆన్‌లైన్‌లో పరిశీలించుకోవచ్చు. ఇదంతా ప్రత్యేక సిస్టమ్ ద్వారా కలెక్టర్ లాగిన్‌కు వెళుతుంది.
 
సంబంధిత అధికారి సమస్యను పరిష్కరించిన తర్వాత వివరాలను కలెక్టర్ లాగిన్‌కు పంపుతారు. ఆ వివరాలను కలెక్టర్ పరిశీలించిన తర్వాత, సమస్య పరిష్కారమైందని భావిస్తే ఆన్‌లైన్‌లో నుంచి సంబంధిత అర్జీ వివరాలు తొలగిస్తారు. లేనిపక్షంలో సంబంధిత అధికారుల పెండింగ్ జాబితాలోనే ఉంటుంది. ఈ పరిష్కారం అమలుపై ప్రతివారం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.సమస్యల పరిష్కారం కొంత వేగవంతమవుతోంది. కలెక్టర్ ప్రత్యేక చొరవపై జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
   
సీఎం ఎదుట డెమో
‘పరిష్కారం’ అమలు తీరును కలెక్టర్ శ్రీకాంత్ మంగళవారం హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు ఎదుట ప్రదర్శించారు. నిధుల ఖర్చు తదితర వివరాలను వివరించారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.
 
ప్రజల వినతికి జవాబుదారీతనం:  ఎన్.శ్రీకాంత్, కలెక్టర్
‘పరిష్కారం’తో ప్రజల వినతికి జవాబుదారీతనం ఉంటుంది. ప్రతి   వినతి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తాం. సమస్య పరిష్కారం ఏ స్థాయిలో ఉందో ఆన్‌లైన్‌లో పరిశీలించుకోవచ్చు. కలెక్టర్ లాగిన్‌కు వచ్చిన వినతి పరిష్కరించేంత వరకు తొలగించం. సమస్యకు పూర్తి పరిష్కారం లభించిన తర్వాతే ఆన్‌లైన్‌లో నుంచి తొలగిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement