‘నైతిక విలువలే ప్రధానం’ | Priority to moral values | Sakshi
Sakshi News home page

‘నైతిక విలువలే ప్రధానం’

Feb 28 2017 12:35 PM | Updated on Sep 2 2018 4:52 PM

ప్రపంచ దేశాల్లో భారతదేశం అత్యంత పవిత్రమైనదని ఉపనిష్మందిరం కార్యదర్శి నిష్టల నరసింహమూర్తి అన్నారు.

పాత శ్రీకాకుళం: ప్రపంచ దేశాల్లో భారతదేశం అత్యంత పవిత్రమైనదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపనిష్మందిరం కార్యదర్శి నిష్టల నరసింహమూర్తి అన్నారు. మండలంలోని మునసబుపేటలో గల గాయత్రి కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ తెలుగువిభాగం సోమవారం కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన హాజరై వివేకానందుని జీవితంపై ప్రసంగించారు.
విద్యార్థులు చక్కని నైతిక సంస్కారాలను నేర్చుకొని మంచి భవిష్యత్‌ రూపొందించుకోవాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ పులఖండం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలుగు విభాగానికి చెందిన భమిటిపాటి గౌరీశంకర్, మధుసూధనరావు, అప్పలనాయుడు, శ్రీలలిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement