
ఉత్తరకోస్తా జిల్లాల్లో మూడురోజుల పాటు అక్కడక్కడ భారీ అకాల వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఐంఎడీ వెల్లడించింది. రాయలసీమలో తేలికపాటి జల్లులుగానీ, వర్షంగానీ కురిసే అవకాశం ఉందని తెలిపింది.
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తాపై వరుణుడు ప్రతాపం చూపనున్నాడు. మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, అకాలవర్షాలతో పాటు పిడుగులుతో దాడి చేయనున్నాడు. రాష్ట్రంలో వాతావరణం మారిన నేపథ్యంలో అకాల వర్షాలకు ఆస్కారం ఏర్పడింది. గురు, శుక్ర, శనివారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో అక్కడక్కడ తేలికపాటి జల్లులుగానీ, వర్షంగానీ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎమ్‌డీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది.
అదే సమయంలో ఉత్తరకోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్నిచోట్ల ఈదురుగాలులు ప్రభావం చూపనున్నాయి. పిడుగులు పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది.