ప్రజాసంకల్పయాత్ర విజయవంతం | praja sankalpa yatra successful in kadapa district : rachamallu sivaprasad reddy | Sakshi
Sakshi News home page

ప్రజాసంకల్పయాత్ర విజయవంతం

Nov 14 2017 7:49 AM | Updated on Jul 25 2018 4:53 PM

praja sankalpa yatra successful in kadapa district : rachamallu sivaprasad reddy - Sakshi

ప్రొద్దుటూరు టౌన్‌ : ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహ న్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రొద్దుటూరు నియోజకవర్గంలో విజయవంతమైందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  ఇంతటి జనాదరణ ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌ తర్వాత జగన్‌కే సాధ్యమైందన్నారు. యాత్రకు పకడ్బందీ బందోబస్తు కల్పించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మండల కన్వీనర్‌ దేవీప్రసాదరెడ్డి, సోములవారిపల్లె నాయకుడు శేఖర్, ఎంపీటీసీ సభ్యులు బోస్, ఓబుళరెడ్డి, నాయకులు పోసా భాస్కర్, స్నూకర్‌ భాస్కర్‌ పాల్గొన్నారు. పత్రికలు వక్రీకరించాయి: ప్రజా సంకల్ప యాత్రలో  రాచమల్లు అలక.. అంటూ కొన్ని చానళ్లు,  పత్రికలు, వక్రీకరించి ప్రచారం, ప్రచురితం చేశాయని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తాను జగన్‌కు నమ్మిన బంటునని పేర్కొన్నారు. చివరి వరకు ఆయనతోనే తన ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement