చీపురుపల్లిలో కాంగ్రెస్‌కు షాక్ | PPC Chief botsa Satyanarayana own constituency Congress party strong shock | Sakshi
Sakshi News home page

చీపురుపల్లిలో కాంగ్రెస్‌కు షాక్

Nov 10 2013 3:26 AM | Updated on Mar 18 2019 7:55 PM

పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బొత్స ప్రధాన అనుచరుడు, ఏఎంసీ మాజీ చైర్మన్

చీపురుపల్లి, న్యూస్‌లైన్ : పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బొత్స ప్రధాన అనుచరుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ మీసాల వరహాలనాయుడు, ఆయన భా ర్య, చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ మీసాల సరోజిని తమ అనుచరులతో కలిసి శుక్రవారం వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వారి చేరికతో స్థానికంగా వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం కానుంది. మీసాల తన వర్గీయులతో కలిసి వైఎస్సార్ సీపీలో చేరడంతో నియోజకవర్గంలో దాదాపుగా కాం గ్రెస్ పార్టీకి నూకలు చెల్లినట్టే.
 
 మొదటి నుంచీ మ ంత్రి బొత్సకు ప్రధాన అనుచురుడిగా ఉన్న మీసాల ఒక్కసారిగా ఆ పార్టీని వీడడంతో రాజకీయంగా కలకలం రేగిం ది. బొత్స మరో ప్రధాన అనుచరుడు, జెడ్పీ మాజీ చైర్మ న్ బెల్లాన చంద్రశేఖర్, మీసాల వరహాలనాయుడు మధ్య మూడేళ్లు గా ఆదిపత్య పోరు జరుగుతోంది. ఇటీవల జరిగిన మేజర్ పంచాయతీ ఎన్నికల్లో మీసాల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా,బెల్లాన చంద్రశేఖర్ భార్య శ్రీదేవిపై తన భార్య సరోజినిని ఎన్నికల్లో నిలబెట్టారు. ఈ ఎన్నికలో సుమారు ఐదు వేల ఓట్ల మెజార్టీతో విజ యం సాధించారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయంగా మీసాల పట్టు సాధించారు. కాగా మీసాల బా టలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మరికొంత మంది నాయకులు కూడా వైఎస్సార్ సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఏదిఏమైనా..మీసాల చేరికలో వైఎస్సార్ సీపీ మరింత బలపడనుంది.
 
 చీపురుపల్లి, న్యూస్‌లైన్ : ప్రజా సమస్యలపై నిరంతం పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపర్చాలని ఆ పార్టీ నాయకుడు, ఏఎంసీ మాజీ చైర్మ న్ మీసాల వరహాలనాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎ స్సార్ సీపీలో చేరిన అనంతరం శనివారం పట్టణానికి వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఆంజనేయపురంలో కొత్త పెట్రోల్ బంకు వద్ద నుంచి పెద్ద ఎత్తున బాణసం చా కాల్చుతూ ఆయన్ను ఊరేగించారు. ఈ సందర్భం గా గాంధీబొమ్మ జంక్షన్ వద్ద ఉన్న దివంగత నేత వై ఎస్ రాజశేఖరరెడ్డి, మహాత్మా గాంధీ విగ్రహాలకు మీ సాల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 
 
 అనంతరం మూడు రోడ్ల జంక్షన్ వద్ద జరిగిన సభలో ఆయ న మాట్లాడుతూ ప్రజల కష్టాలు తెలుసుకుని, వారి సం క్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేసిన నాయకు డు మహానేత వైఎస్సార్ అన్నారు. ఆయన ఆశయ సా ధనే లక్ష్యంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్ పాలన మళ్లీ చూడాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయూలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకు   లు తుమ్మగంటి సూరినాయుడు, పల్లేడ బంగారరాజు, రొబ్బి రమణ, డబ్బాడ శంకర్, గవిడి సురేష్, ఎల్లంటి శివ, కం చుపల్లి రమేష్, రఘుపాత్రుని చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement