తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా ప్రీమియాలను ఆన్‌లైన్....
విజయవాడ: తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా ప్రీమియాలను ఆన్‌లైన్‌లో చెల్లించే విధంగా తపాలా శాఖ మెకానిష్ అనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దశల వారీగా దీన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది.
పాలసీదారులు తమకు దగ్గరలో ఉన్న తపాలా శాఖ ప్రధాన కార్యాలయాలకు వెళ్లి ప్రీమియం పాస్ పుస్తకాలనుగానీ, వాటి నకలు కాపీలను గానీ అందజేసి ప్రీమియం చెల్లింపులను క్రమబద్ధీకరించుకోవాలనీ, ఈ నెల 15 లోగా ఈ చెల్లింపులను పూర్తి చేసుకోవాలని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల తపాలా శాఖ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం బుధవారం నాడొక ప్రకటనలో పేర్కొంది.