చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నంగమంగళం వద్ద రూ.10లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు గురువారం ఉదయం పట్టుకున్నారు.
గుడిపాల : చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నంగమంగళం వద్ద రూ.10లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు గురువారం ఉదయం పట్టుకున్నారు. వివరాలు.. కాణిపాకం వద్ద స్కూటర్‌ను ఓ కారు ఢీకొంది. దీంతో స్కూటరిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కారును వెంబడిస్తుండగా సుమారు ఐదు కిలోమీటర్ల వెళ్లిన తర్వాత కారును వదిలి నిందితులు పరారయ్యారు. పోలీసులు ఆ కారును పరిశీలించగా అందులో11 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. కారును, ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.10లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
- గుడిపాల