breaking news
car owned
-
కోట్లు విలువ చేసే అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - వారెవరో తెలుసా?
ప్రపంచంలోని చాలామంది ధనవంతులు ఖరీదైన లగ్జరీ కార్లను వినియోగిస్తారనే సంగతి తెలుసు. అయితే భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే వారు ఎవరు, వారు ఎలాంటి కార్లను వినియోగిస్తున్నారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విఎస్ రెడ్డి - బెంట్లీ ముల్సానే సెంటినరీ ఎడిషన్ EWB భారతదేశంలో ఖరీదైన విలాసవంతమైన కార్లు ఉపయోగించే వారి జాబితాలో మెడికల్ న్యూట్రిషన్ తయారీ కంపెనీలలో ఒకటైన బ్రిటిష్ బయోలాజికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ 'VS రెడ్డి' ఉన్నారు. ఈయన ఉపయోగించే బెంట్లీ ముల్సానే సెంటినరీ ఎడిషన్ ఈడబ్ల్యుబి ధర సుమారు రూ. 14 కోట్లు. బెంట్లీ కంపెనీ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ కారు ప్రపంచ వ్యాప్తంగా 100 యూనిట్లకు మాత్రమే పరిమతమై ఉంది. ఇది 6.75 లీటర్ వి8 ఇంజిన్ కలిగి 506 హెచ్‌పి పవర్ 1020 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కేవలం 5.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 296 కిలోమీటర్లు. ముఖేష్ అంబానీ - రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII EWB & మెర్సిడెస్ S600 గార్డ్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII EWB భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ముఖేష్ అంబానీ ఒకరు. ఈయన గ్యారేజిలో ఉన్న ఖరీదైన కార్లలో ఒకటి రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఫాంటమ్ సిరీస్ VIII EWB. దీని ధర రూ. 13.5 కోట్లు. ఈ లగ్జరీ కారు 6.75-లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ కలిగి 563 బిహెచ్పి పవర్, 900 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మెర్సిడెస్ S600 గార్డ్ అంబానీ గ్యారేజిలోని మరో ఖరీదైన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఎస్600 గార్డ్. ఇది ముఖేష్ అంబానీకి కోసం ప్రత్యేకంగా తాయారు చేసిన కారు. దీని ధర సుమారు రూ. 10 కోట్లు. ఈ కారుని ముఖేష్ అంబానీ మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. (ఇదీ చదవండి: ఉద్యోగికి రూ. 1500 కోట్ల ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ముఖేష్ అంబానీ) కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్స్ కలిగిం ఈ కారు బాడీ షెల్ రీన్ఫోర్స్డ్ స్టీల్‌తో తయారు చేశారు. ఇది ట్విన్ టర్బోచార్జ్ 6 లీటర్ వి12 ఇంజిన్ కలిగి 523 బిహెచ్పి పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ముఖేష్ అంబానీ గ్యారేజిలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII EWB మాత్రమే కాకుండా రోల్స్ రాయిస్ ఫాంటమ్, కల్లినన్స్, గోస్ట్స్ వంటి కార్లతో పాటు ఇతర బెంజ్, ఆడి, బెంట్లీ కార్లు ఉన్నాయి. వీరి సెక్యురిలో కూడా అత్యంత ఖరీదైన కార్లు వినియోగించడం గమనార్హం. (ఇదీ చదవండి: పోర్షేకు షాక్.. కస్టమర్ దెబ్బకు రూ. 18 లక్షలు ఫైన్ - కారణం ఇదే..!) నసీర్ ఖాన్ - మెక్లారెన్ 765 LT స్పైడర్ అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో హైదరాబాద్ నగరానికి చెందిన 'నసీర్ ఖాన్' కూడా ఉన్నారు. ఈయన వద్ద ఉన్న ఖరీదైన కారు మెక్లారెన్ 765 LT స్పైడర్. దీని ధర రూ. 12 కోట్లు. ఈ మోడల్ ప్రపంచ వ్యాప్తంగా 765 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది 4.0 లీటర్ ట్విన్ టర్బో వి8 పెట్రోల్ ఇంజిన్ కలిగి 765 పిఎస్ పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సూపర్ కారు 7-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో ఉత్తమ పనితీరుని అందిస్తుంది. రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్: నసీర్ ఖాన్ గ్యారేజిలో మరో ఖరీదైన కారు రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కల్లినన్. దీని ధర సుమారు రూ. 8.20 కోట్లు. ఇది షారుఖ్ ఖాన్ వంటి ఇతర సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. ఈ లగ్జరీ కారు 6.75 లీటర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 600 బిహెచ్పి పవర్, 900 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
పుల్వామా దాడిలో వాడింది ఇతడి కారునే
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పుల్వామాలో ఈనెల 14వ తేదీన జరిగిన ఆత్మాహుతి దాడిపై సాగుతున్న దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ దాడిలో వినియోగించింది ‘మారుతి ఈకో’ కారు అని తేల్చిన జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) దాని యజమానిని కూడా గుర్తించింది. ఫోరెన్సిక్ నిపుణులు, వాహన నిపుణులు కలిసి చేసిన దర్యాప్తులో ఛాసిస్ నంబర్ ఆధారంగా ఆ కారు ఎవరి వద్ద ఉన్నదీ కనిపెట్టారు. అనంత్‌నాగ్ జిల్లా కేంద్రంలోని హెవెన్ కాలనీకి చెందిన జలీల్ అహ్మద్ హకానీ 2011లో మొదట ఈ కారును కొనుగోలు చేశాడు. అనంతరం ఇది ఏడుగురి చేతులు మారి ఆఖరుకు దక్షిణ కశ్మీర్‌లోని బిజ్బెహారాకు చెందిన సజ్జాద్ భట్‌కు చేరింది. ఇతడు ఈ కారును ఫిబ్రవరి 4వ తేదీన అంటే దాడికి పది రోజుల ముందు కొనుగోలు చేశాడు. ఇతడిని షోపియాన్‌లోని సిరాజ్–ఉల్–ఉలూమ్ స్కూలు విద్యార్థిగా గుర్తించారు. ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు శనివారం అతడుండే ఇంటిపై దాడి చేశారు. కానీ, అతడు అక్కడ లేదు. ఆయుధాలు పట్టుకున్నట్లుగా ఉన్న అతడి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుండటంతో ఉగ్ర సంస్థ జైషే ముహమ్మద్‌లో చేరి ఉంటాడని భావిస్తున్నారు. జైషే ముహమ్మద్‌కు చెందిన ఆదిల్ అహ్మద్ దార్ అనే వ్యక్తి పేలుడు పదార్థాలు నింపిన కారుతో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పైకి దూసుకెళ్లగా 40 మంది జవాన్లు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. -
రూ.10 లక్షల ఎర్రచందనం పట్టివేత
గుడిపాల : చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నంగమంగళం వద్ద రూ.10లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు గురువారం ఉదయం పట్టుకున్నారు. వివరాలు.. కాణిపాకం వద్ద స్కూటర్‌ను ఓ కారు ఢీకొంది. దీంతో స్కూటరిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కారును వెంబడిస్తుండగా సుమారు ఐదు కిలోమీటర్ల వెళ్లిన తర్వాత కారును వదిలి నిందితులు పరారయ్యారు. పోలీసులు ఆ కారును పరిశీలించగా అందులో11 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. కారును, ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.10లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. - గుడిపాల