పోచంపల్లి బ్యాంకుకు జాతీయ అవార్డు | pocham pally Bank, National Award | Sakshi
Sakshi News home page

పోచంపల్లి బ్యాంకుకు జాతీయ అవార్డు

Oct 25 2013 3:21 AM | Updated on Sep 1 2017 11:56 PM

పోచంపల్లి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయని బ్యాంకు చైర్మన్ కర్నాటి పాండు, సీఈఓ సీత శ్రీనివాస్ తెలిపారు.

భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌లైన్ : పోచంపల్లి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయని బ్యాంకు చైర్మన్ కర్నాటి పాండు, సీఈఓ సీత శ్రీనివాస్ తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతిఏటా ముంబయిలోని బ్యాంకింగ్ ఫ్రాంటియర్స్ ఈ అవార్డులు అందజేస్తుందని పేర్కొన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో బెస్ట్ ఎన్‌పీఏ మేనేజ్‌మెంట్ కింద ఒక అవార్డు, మరొకటి ఆదాయ సముపార్జనకు వచ్చినట్లు చెప్పారు.
 
 కాగా ఈ నెల 22వ తేదీన బెంగళూరులో జరిగిన ‘జాతీయ సహకార సంస్థల సమ్మేళన’ సమావేశంలో నాబ్కాబ్ సీఈఓ డి.కృష్ణ, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ శశిధర్ చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ జిట్ట చంద్రమౌళి, డైరక్టర్లు కర్నాటి బాలసుబ్రమణ్యం, తడ్క రమేష్, గుర్రం ప్రభాకర్, సీత శోభ, సీత వెంకటేశం, విష్ణు, అశోక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement