‘పిచ్చుక’కు న్యూయార్క్ టై మ్స్‌లో చోటు | pichuka srinivas rao got article in newyork times | Sakshi
Sakshi News home page

‘పిచ్చుక’కు న్యూయార్క్ టై మ్స్‌లో చోటు

Dec 14 2013 4:18 AM | Updated on Sep 2 2017 1:34 AM

పెడనలో ప్రముఖ కలంకారీ వ్యాపార వేత్త పిచ్చుక శ్రీనివాసరావు తయారు చేసిన వ స్త్రాలపై ‘న్యూయార్క్ టైమ్’ పత్రికలో కథనం చోటుచేసుకుంది.


 పెడన, న్యూస్‌లైన్ : పెడనలో ప్రముఖ కలంకారీ వ్యాపార వేత్త పిచ్చుక శ్రీనివాసరావు తయారు చేసిన వ స్త్రాలపై ‘న్యూయార్క్ టైమ్’ పత్రికలో కథనం చోటుచేసుకుంది. అమెరికాలో లెస్ ఇండియన్స్ షో రూంలో పెడన కలంకారీ వస్త్రాలను అమ్మకానికి  ఇటీవల ప్రదర్శించారని,   పెడన కలంకారీ వస్త్రాలతో తయారు చేసిన ఫిల్లో కవర్ల ఫొటోతో  ఉన్న ఆర్టికల్‌ను 11వ తేదీన న్యూయార్క్‌టైమ్స్‌లో ప్రచురించారని పిచ్చుక తెలిపారు.  శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన చిరకాలవాంఛ నెరవేరిందని చెప్పారు. కలంకారీ ముడి వస్త్రాలను చెన్నయ్ నుంచి దిగుమతి చేసుకుని  కరక్కాయ, కుంకుడు కాయలతో వస్త్రాలను నానాబెట్టి వాటిని ఉడకబెట్టి వస్త్రాన్ని రంగు మారేలా తీర్చిదిద్దుతామన్నారు. ఆ తర్వాత ప్రవాహించే నది నీటిలో వస్త్రాలను ఉతికి ఆరబెట్టి వస్త్రాలపై వెజిటబుల్స్‌తో తయారు చేసిన సహజసిద్ధమైన రంగులను ముద్రించేందుకు సిద్ధం చేస్తామని చెప్పారు.  
 
 ఆ వస్త్రాలపై   దేశ ,విదేశీ ప్రముఖులతో డిజైనింగ్ చేయించి  తయారు చేస్తామని, ఇంటి వద్దనే  బెడ్ షీట్లు, పిల్లో కవర్లు, హ్యాండ్ కట్ చీప్‌లు, చీరలు, డోర్ కర్టెన్లు తదితర రకాల వస్త్రాలను తయారుచేస్తామని తెలిపారు.  జపాన్, జర్మనీ, డెన్మార్క్, నెదర్లాండ్, ఆస్ట్రేలియా   దేశాలకు ఐదేళ్లనుంచి ఎగుమతి చేస్తున్నామని... ఈ విషయాలన్నీ ఆ పత్రికలో ప్రచురించారని శ్రీనివాసరావు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement