ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై మాజీ ఐఏఎస్ అధికారి, సామాజిక కార్యకర్త ఈఏఎస్ శర్మ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై మాజీ ఐఏఎస్ అధికారి, సామాజిక కార్యకర్త ఈఏఎస్ శర్మ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అమరావతి నిర్మాణానికి ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని కోరుతూ ఆయన మంగళవారం ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో యూనియన్ ఆఫ్ ఇండియా, కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, రాష్ట్ర అటవీశాఖ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ప్రతివాదులుగా చేర్చారు.
శర్మ తన పిటిషన్లో బహుళ పంటలు పండే ప్రాంతంతో పాటు సున్నితమైన పర్యావరణ ప్రాంతంలో విమానాలకు అనుమతికి రాష్ట్ర అథారిటీ లేదని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేసిన గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతంలో భారీ భవనాలను నిర్మించడం వల్ల కృష్ణా రివర్ బెడ్కు ముప్పు పొంచివుందని, అంతే కాకుండా అమరావతి నిర్మాణ అనుమతులు ...నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు.
కాగా గతంలో కూడా పర్యావరణ చట్టాలను, నిబంధనలను పాటించడం లేదంటూ శ్రీమన్నారాయణ అనే వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం, సీఆర్డీఏ, కేంద్ర పర్యావరణ శాఖలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.