తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు.
రామచంద్రాపురం: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. మండలం ఓగూరు వద్ద ఆదివారం బైక్‌పై వెళ్తున్న ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలైన అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మృతుడు పశ్చిమగోదావరికి చెందిన వాడిగా అనుమానిస్తున్నారు.