
మంత్రి గారికి కోపం వచ్చింది
వైఎస్ఆర్సీపీ నేత ప్రసాదరెడ్డి హత్యకేసులో ఎస్ఐ, సీఐలను వీఆర్కు పంపడంపై మంత్రి పరిటాల సునీత తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
వైఎస్ఆర్సీపీ నేత ప్రసాదరెడ్డి హత్యకేసులో ఎస్ఐ, సీఐలను వీఆర్కు పంపడంపై మంత్రి పరిటాల సునీత తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ప్రభుత్వం తనకు కేటాయించిన ముగ్గురు గన్మెన్, ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందిని వెనక్కి పంపేశారు.
ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చెప్పాలని కూడా ఆమె చెప్పారు. వైఎస్ఆర్సీపీ నేత ప్రసాదరెడ్డి హత్య కేసులో ఇటుకులపల్లి ఎస్ఐ, రాప్తాడు సీఐలను డీఐజీ బాలకృష్ణ వీఆర్కు పంపిన విషయం తెలిసిందే. ఈ విషయమే మంత్రి పరిటాల సునీతకు కోపం తెప్పించింది.