గన్మెన్ను వెనక్కి రప్పించుకున్న పరిటాల సునీత | paritala sunita attends AP cabinet meeting with security personel | Sakshi
Sakshi News home page

గన్మెన్ను వెనక్కి రప్పించుకున్న పరిటాల సునీత

May 4 2015 10:31 AM | Updated on Sep 15 2018 8:44 PM

గన్మెన్ను వెనక్కి రప్పించుకున్న పరిటాల సునీత - Sakshi

గన్మెన్ను వెనక్కి రప్పించుకున్న పరిటాల సునీత

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత గన్మెన్ను వెనక్కి రప్పించుకున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత గన్మెన్ను వెనక్కి రప్పించుకున్నారు. ఈ రోజు ఉదయం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి సునీత గన్మెన్ రక్షణలో వచ్చారు.

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యకేసులో ఇటుకలపల్లి సీఐ, రాప్తాడు ఎస్ఐలను వీఆర్కు పంపడంపై మంత్రి పరిటాల సునీతకు కోపం తెప్పించింది. ప్రభుత్వం తనకు కేటాయించిన ముగ్గురు గన్మెన్, ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందిని సునీత వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. పరిటాల సునీత డీజీపీ, హోంమంత్రితో సంప్రదించిన అనంతరం సీఐ, ఎస్ఐలను వీఆర్కు పంపకుండా యధాతథంగా అవే పోస్టుల్లో కొనసాగించారు. దీంతో సునీత గన్మెన్ను వెనక్కు రప్పించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement