బాబుకు మంచి బుద్ధి ప్రసాదించండి | Parents a better understanding prasadincandi | Sakshi
Sakshi News home page

బాబుకు మంచి బుద్ధి ప్రసాదించండి

Jan 4 2015 1:42 AM | Updated on May 29 2018 4:18 PM

బాబుకు మంచి బుద్ధి ప్రసాదించండి - Sakshi

బాబుకు మంచి బుద్ధి ప్రసాదించండి

రాజ్యాంగం ద్వారా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ దళితులను అందించిన ఫలాలను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు దక్కకుండా చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎస్సీ.....

అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నేతల విన్నపం
 
గుంటూరు సిటీ: రాజ్యాంగం ద్వారా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ దళితులను అందించిన ఫలాలను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు దక్కకుండా చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. దళితులను దగా చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి ప్రసాదించాలని కోరుతూ లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి శనివారం ఆయన వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధంగా ఎస్సీ ఎస్టీలకు కేటాయించాల్సిన బ డ్జెట్‌ను రూ. 2500 కోట్లకు తగ్గించిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం దళితులు, గిరిజనుల సంక్షేమానికి ఖర్చు చేయూల్సిన రూ.4 వేల కోట్లకుపైగా నిధులు మిగిలి ఉన్నాయని, వచ్చే 3నెలల్లో ఖర్చు పెట్టకపోతే మురిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుపు రేషన్‌కార్డుదారులకు ప్రకటించిన సంక్రాంతి ప్యాకేజీ ద్వారా ప్రభుత్వం పచ్చచొక్కాల జేబులు నింపే పనిలో ఉందన్నారు.

పార్టీ తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కత్తెర క్రిస్టీనా, గుంటూరు రూరల్  జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, ఎస్సీ సెల్ జిల్లా, నగర కన్వీనర్లు బండారు సాయిబాబు, విజయ్‌కిషోర్, జిల్లా సేవాదళ్ కన్వీనర్ కొత్తా చిన్నపరెడ్డి, నేతలు ఎం.పురుషోత్తం, ఎం.దేవరాజ్, విజయ్ డేవిడ్, దాసరి నాగరాజు, కోడిరెక్క దేవదాసు, జయరాజు, డేవిడ్, రాచకొండ ముత్యాలరాజు, శ్రీనివాసనాయక్, బి.కిషోర్, పి.సుబ్బారెడ్డి, యమనాల ప్రకాష్, దేవదాస్, ఎం.అబ్బు, దర్శి రమేష్, శివయ్య, అద్దంకి రాజు, ఎం.నాగేశ్వరరావు, సోముకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement