పల్లెల్లో పంచాయతీ కార్యదర్శుల కొరత త్వరలో తీరనుంది. పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్
పంచాయతీ పోస్టులు 133
Dec 31 2013 3:57 AM | Updated on Aug 29 2018 4:16 PM
సాక్షి, నల్లగొండ :పల్లెల్లో పంచాయతీ కార్యదర్శుల కొరత త్వరలో తీరనుంది. పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఆశ చిగురిస్తోం ది. జిల్లాలో మొత్తం 133 పోస్టులను భర్తీ చేయనున్నారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 20వ తేదీ ఆఖరి గడువు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేయాల్సి ఉం టుంది. రాత పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహిస్తారు. 18 ఏళ్ల వయస్సు నుంచి ఈ ఏడాది జూలై నాటికి 36 ఏళ్లు దాటని అభ్యర్థులు అర్హులని నోటిఫికేషన్‌లో సర్కారు పేర్కొంది. ఏదేని డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఓపెన్‌లో 59, బీసీలో 36, ఎస్సీ 20, ఎస్టీ 9, వికలాంగులు 5, మాజీ సైనికుల విభాగాల్లో 4 పోస్టులు ఉన్నాయి.
అదనంగా....
జిల్లాలో 1169 గ్రామ పంచాయతీలను 573 క్లస్టర్లుగా విభజించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక కార్యదర్శి అవసరం. అయితే జిల్లాలో దాదాపు 410 మంది కార్యదర్శులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇప్పటికే కాం ట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న 38 కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయడానికి మూడు నెలల క్రితం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అందుకు వీరికి 25 మార్కుల వెయిటేజీ కల్పించింది. కాంట్రాక్టు కార్యదర్శులతోపాటు ఇతర అభ్యర్థులు కూడా పెద్ద సం ఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తుదారుల అభ్యంతరాల స్వీకరణ సోమవారంతో ముగిసింది. ఇవిగాక తాజా నోటిఫికేషన్ ద్వారా 133 పోస్టులు భర్తీ కానున్నాయి. దరఖాస్తులు, ఖాళీల వివరాలు, పరీక్ష సమయం తదితర వివరాల కోసం ఠీఠీఠీ. ్చఞటఞటఛి.జౌఠి.జీలో చూడవచ్చు.
రిజర్వేషన్ ఇలా...
కేటగిరి జనరల్ మహిళ
ఓసీ 38 21
బీసీ -ఏ 7 3
బీసీ - బీ 7 5
బీసీ - సీ 2 -
బీసీ -డీ 5 3
బీసీ - ఈ 3 1
ఎస్సీ 13 7
ఎస్టీ 6 3
వికలాంగ 3 2
మాజీ సైనికులు 2 2
మొత్తం 86 47
Advertisement
Advertisement