నేవీలో హనీట్రాప్‌: నిందితుల రిమాండ్‌ పొడిగింపు

Operation Dolphin Nose: NIA Speed Up Investigation - Sakshi

సాక్షి, విజయవాడ: నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ‘ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌’ విచారణను వేగవంతం చేసింది. ఈ మేరకు 11 మంది నేవీ సిబ్బందిని ఎన్‌ఐఏ అధికారులు సోమవారం ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు. విచారణలో భాగంగా నిందితులను పోలీసు కస్టడీకి అప్పగించాలని ఎన్‌ఐఏ అధికారులు కోరారు. నిందితుల తరపు న్యాయవాది కోటంరాజు వెంకటేష్‌ శర్మ మాట్లాడుతూ న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నిందితులను ఈ నెల 17 నుంచి 22 వరకు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిందితుల రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. 

పాకిస్తాన్‌ వలపు వల..
భారత నౌకాదళ సమాచారాన్ని తెలుసుకునేందుకు పాకిస్తాన్‌.. భారత నేవీ సిబ్బందిని టార్గెట్‌ చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ ఏజెంట్లు ఫేస్‌బుక్‌లో యువతుల పేరుతో నేవీ ఉద్యోగులను ట్రాప్‌ చేసి భారత్‌ రహస్యాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఈ వలలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న నేవీ సిబ్బంది చిక్కుకున్నారు. ఇక ఈ వ్యవహారంపై ఎన్‌ఐఏ, ఏపీ ఇంటెలిజెన్స్, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్‌ సంయుక్తంగా ‘ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌’ మొదలుపెట్టాయి. ఈ ఘటనతో నౌకాదళం ఒక్కసారిగా ఉలిక్కిపడగగా ఇంటిదొంగల పనిపట్టేందుకు విచారణ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో పాక్‌ హనీట్రాప్‌లో పడి భారత నేవీ రహస్యాలను చేరవేసిన 11 మంది నేవీ సిబ్బందిని కోర్టులో హాజరుపర్చి విచారణ జరుపుతున్నారు.

చదవండి: నేవీలో హానీట్రాప్‌పై ఎన్‌ఐఏ విచారణ!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top