ఒంగోలు గిత్త అదిరింది.. | Ongole gitta's Cannes .. | Sakshi
Sakshi News home page

ఒంగోలు గిత్త అదిరింది..

Jan 10 2015 2:55 AM | Updated on Sep 2 2017 7:27 PM

ఒంగోలు గిత్త అదిరింది..

ఒంగోలు గిత్త అదిరింది..

పౌరుషానికి ప్రతీకగా నిలిచే ఒంగోలు జాతి పశువుల ప్రదర్శన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో శుక్రవారం ప్రారంభమైంది.

పౌరుషానికి ప్రతీకగా నిలిచే ఒంగోలు జాతి పశువుల ప్రదర్శన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో శుక్రవారం ప్రారంభమైంది. కనుపర్తిపాడు సమీపంలోని ట్రస్ట్ మైదానంలో మూడురోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్‌ట్రస్ట్ ఆధ్వర్యంలో  ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు రాష్ట్ర నలు మూలల నుంచి ఒంగోలు జాతి గిత్తలు, కోడెదూడలు, ఆవులు తరలి రావడంతో వాటిని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. నిర్వాహకులు పశువుల కోసం ప్రత్యేక టెంట్లు, వెద్య సేవలు ఏర్పాటు చేశారు.    
- నెల్లూరు
 

Advertisement
 
Advertisement
Advertisement