బైక్ అదుపు తప్పడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.
గుంటూరు (రేపల్లె) : బైక్ అదుపు తప్పడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని నిజాంపట్నం రోడ్డులో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అకస్మాత్తుగా జారిపడిపోయాడు. దీంతో స్థానికులు అతని దగ్గరికి వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. కాగా మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.