మరోసారి కూన రవికుమార్‌ రౌడీయిజం.. | Sakshi
Sakshi News home page

అంతేనా వీరు.. మారదా తీరు 

Published Mon, Mar 2 2020 8:40 AM

Once Again TDP Leader Kuna Ravikumar Rowdyism  - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ తన నైజాన్ని మరోసారి బయటపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూసి బూ తులు తిట్టే ఈ నాయకుడి వైఖరి మరోసారి బట్టబయలైంది. ఓడిపోయానన్న బాధ ఇంకా పోలేదో.. అధికారంలో లేనన్న సంగతి గుర్తు లేదో గానీ ప్రభుత్వ అధికారిపై మరోసారి నోరుజారారు. రాయ లేని భాషలో బెదిరింపులకు దిగారు. ఆ మధ్య ఎంపీడీఓ, ఈవోపీఆర్‌డీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ జే ఈని బెదిరించగా, తాజాగా సరుబుజ్జిలి ఇన్‌ చార్జి ఈఓపీఆర్‌డీకి ఫోన్‌ చేసి బూతులు తిట్టిన వైనం ఆదివారం బయటపడింది.

ఇన్‌చార్జి ఈఓపీఆర్డీ గూనపు వెంకట అప్పలనాయుడుతో కూన రవికుమార్‌ జరిపిన ఫోన్‌ సంభాషణ ఇది.. 
కూన రవి: హలో 
ఈఓపీఆర్డీ గూనపు వెంకట అప్పలనాయుడు : సార్‌ నమస్తే సార్‌ 
కూన రవి: ఆ.. నమస్తే.. ఏమయ్యా నీవు బాగా పెద్దోడివయ్యినట్లు ఉన్నావ్‌  
ఈఓపీఆర్డీ: లేదు.. లేదు సార్‌  
కూన రవి: నీకు ఎంత ఒల్లు బలిసిందంటే నా కొడకా... నా నంబర్‌తో ఫోన్‌ చేస్తే ఫోన్‌ లిఫ్ట్‌ చేయవా  
ఈఓపీఆర్డీ: వీసీలో ఉన్నాను సార్‌.. ఫోన్లు తీయలేదు 
కూన రవి:    ఆ తర్వాత ఏం చేశావ్‌...... 
ఈఓపీఆర్డీ:    ఆ తర్వాత చూడలేదు సార్‌ 
కూన రవి:    చూడకపోతే ఫోన్‌ చేయవా 
ఈఓపీఆర్డీ : ఫోన్‌ పక్కన పెట్టేసి మర్చిపోయా సార్‌.. 
కూన రవి: ఒరే నా కొడకా హస్కీలో ఉన్నా నిన్ను భూమిలోంచి తీసి నిన్ను పాతీకిపోతాను నా కొడకా... నీవు హస్కీలో ఉండు నా కొడకా నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమార్‌నే కాదు నా కొడకా.. నీ బతుకెంతరా నా కొడకా  
ఈఓపీఆర్డీ: విషయం.. విషయం ఏమిటి చెప్పండి సార్‌.. 
కూన రవి : దొంగనా కొడకా.. నీకు విషయం చెప్పాల్రా నేను  
ఈఓపీఆర్డీ : ఏమిటి చెప్పండి సార్‌ 
కూన రవి : దొంగనా కొడకా నిన్ను గొయ్యి తీసి పాతకపోతే.. నీవు ఈఓఆర్డీగా వచ్చావురా.. నీ ఉద్యోగం ఏమిటి అక్కడ? 
ఈఓపీఆర్డీ: ఈఓపీఆర్డీ చెప్పండి 
కూన రవి  : ఆ... ఈఓఆర్డీ నీకెంత ధైర్యంరా మరల అక్కడకే వచ్చినావు 
ఈఓపీఆర్డీ : రాలేదు సార్‌ నేను ఎఫ్‌ఏసీ 
కూన రవి : ఏటి ఎఫ్‌ఏసీ నీకెవడురా ఇచ్చారు అక్కడ. జూనియర్‌ అసిస్టెంట్‌కు ఎఫ్‌ఏసీరా నీకు 
ఈఓపీఆర్డీ : సీనియర్‌ అసిస్టెంట్‌ని సార్‌ 
కూన రవి : రావివలస పంచాయతీ డబ్బులు ఆ రాయుడుకు ఎందుకురా ఇవ్వలేదు. 
ఈఓపీఆర్డీ : రావివలసది 30వేలు ఉంది సార్‌ అక్కడ. 
కూన రవి :  రూ.30వేలు ఉంటే తీసి ఇవ్వలేవా 
ఈఓపీఆర్డీ : రూ.30వేలు అంటే రూ.70వేలు ఆయనది. 
కూన రవి : ఆ.. 
ఈఓపీఆర్డీ :  రూ.20వేలు కొడుతుంటే ఆన్‌లైన్‌లో రిజెక్టెడ్‌ అని వస్తుంది సార్‌ అక్కడ 
కూన రవి : ఏంటి రిజెక్ట్‌ అని వస్తుంది 
ఈఓపీఆర్డీ : ఆ అమౌంట్‌ సరైన అమౌంట్‌ లేదని రిజెక్ట్‌ వస్తుంది, అది పెట్టమంటే మీకు రేపు పెడతా. 
కూన రవి : రేపు ఇమ్మీడియట్‌గా పెట్టు లేదా రూ.10లేదా రూ.15వేలు కొట్టు 
ఈఓపీఆర్డీ : పెడతా సార్‌ వాట్సాప్‌లో పెడతా సార్‌ 
కూన రవి : వాట్సాప్‌లో పెట్టు. ఈసారి  లగాయత్తు.. న నంబర్‌ గానీ ఎత్తకపోయావో వైజాగ్‌లో ఉన్నా నీ ఇంటికి వచ్చి ఎత్తుకుపోతా నా కొడకా.. అంటూ ఫోన్‌ పెట్టేశారు.

ఇలా సరుబుజ్జిలి ఇన్‌చార్జి ఈఓపీఆర్‌డీగా ఉన్న గూనపు వెంకట అప్పలనాయుడుపై బండ బూతులు తిట్టి విరుచుకుపడ్డారు. కూన రవికుమార్‌కు ఇది కొత్తేమీ కాదు. గతంలో సరుబుజ్జిలి ఎంపీడీఓ ఎ.దామోదరరావు, అప్పటి ఈఓపీఆర్‌డీ పీవీ మురళిమోహన్‌పై దూషణలకు దిగారు. ‘ఆఫీసులోనే తులుపులు వేసి మరీ బాదేస్తాను. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. నన్వు ఎవరూ ఆపలేరు. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా’ అంటూ సరుబుజ్జిలి ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని మాజీ విప్‌ కూన రవికుమార్‌ బెదిరించారు. అలాగే, బూర్జలో ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ ని కూడా నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. ఇక పంచాయతీ కార్యదర్శులకైతే లెక్క లేదు. చెప్పినట్టు వినకపోతే కురీ్చలో కూర్చొన్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా అని తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే సరుబుజ్జిలి ఎంపీడీఓ, గత ఈఓపీఆర్‌డీని బెదిరించిన కేసులో బెయిల్‌పై ఉన్నారు. బయటికొచ్చినవి కొన్నే. కానీ నియోజకవర్గంలో ఆయన ఆగడాలు ఇంతా అంతా కాదు. ప్రభుత్వ ఉద్యోగుల్ని పురుగుల్లా చూస్తున్నారని నోటికొచ్చినట్టు తిడుతున్నారని ఎన్నో ఉన్నాయి.

కూనతో ప్రాణహాని ఉంది.. 
మాజీ విప్‌ కూన రవికుమార్‌ బెదిరింపులు తట్టుకోలేకపోతున్నాం. ఫోన్‌ చేసి నోటికొచ్చినట్టు తిడుతున్నారు. ప్రజాస్వామ్యంగా పనులు చేసుకోవాలే తప్ప. ఇలా బెదిరిస్తూ, తిడుతూ పనులు చేయించాలనుకోవడం సరికాదు. గతంలో కూడా నాతో దురుసుగా మాట్లాడారు. ఆయనకిది అలవాటైపోయింది. ఇలాగైతే పనిచేయలేం. తరుచూ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. గతంలో కూడా వ్యక్తిగత దూషణకు పాల్పడ్డారు. ప్రస్తుతం నేను వైజాగ్‌లో ఉన్నా తంతాను అని బెదిరించారు. నాకు ప్రాణహాని ఉంది. దీనిపై ఆమదాలవలస సీఐ బి.ప్రసాదరావుకు ఫిర్యాదు చేశాను.   
– గూనపు వెంకట పెద అప్పలనాయుడు    

Advertisement
Advertisement