హంస వాహనంపై చెన్నకేశవుడు | on swan vehicle chennakesavudu | Sakshi
Sakshi News home page

హంస వాహనంపై చెన్నకేశవుడు

Apr 27 2014 4:56 AM | Updated on Nov 6 2018 5:47 PM

హంస వాహనంపై చెన్నకేశవుడు - Sakshi

హంస వాహనంపై చెన్నకేశవుడు

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి హంస వాహనోత్సవం శనివారం రాత్రి వైభవంగా జరిగింది.

మార్కాపురం టౌన్, న్యూస్‌లైన్: శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి హంస వాహనోత్సవం శనివారం రాత్రి వైభవంగా జరిగింది. స్వామి వారు ప్రజాపతి అలంకారంలో హంస వాహనంపై పట్టణ మాడవీధుల్లో దర్శనమిచ్చారు. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొన్నారు. వేకువజామున మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులకు తిరుమంజనం, స్వామివారి మూలవిరాట్‌ను, అమ్మవారి మూలవిరాట్‌కు అర్చనలు, నిత్యహోమాలు మంగళ హారతులను అర్చకులు శ్రీపతికేశవచార్యులు, నంద్యాల తిరుమలచార్యులు నిర్వహించారు.

 

  రాత్రి 11 గంటలకు స్వామి ఉత్సవమూర్తులను ప్రజాపతి అలంకారంలో హంస వాహనంపై అలంకరించి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉభయదాతలుగా పైడా దివాకరరావు, మార్కాపురం పట్టణ ఆర్యవైశ్య సంఘంవారు వ్యవహరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ మేనేజర్ ఏవి.నారాయణరెడ్డి, సిబ్బంది పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement