ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం పదో షెడ్యూల్లోని శిక్షణ సంస్థలు, తొమ్మిదో షెడ్యూల్లోని సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు వర్తించదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
పదవీ విరమణ వయసు పెంపుపై ఏపీ ఆర్థికశాఖ సర్క్యులర్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం పదో షెడ్యూల్లోని శిక్షణ సంస్థలు, తొమ్మిదో షెడ్యూల్లోని సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు వర్తించదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ కల్లం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ వయసును 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
స్థానిక సంస్థలు, అసెంబ్లీ, మండలి సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసు పెంపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చిన 89 సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగలకు కూడా పెంపు వర్తించదని వివరించింది.