రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర సాధన కోసం చేపడుతున్న ఉద్యమాలలో భాగంగా ఈ నెల 7వ తేదీన జిల్లా బంద్ చేపడుతున్నట్లు జేఏసీ నాయకులు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్.రామచంద్రారెడ్డి, ఎస్.గోవర్థన్‌రెడ్డి, నిత్యానందరెడ్డి,ఎస్.రమణయ్య తెలిపారు.
కడప రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర సాధన కోసం చేపడుతున్న ఉద్యమాలలో భాగంగా ఈ నెల 7వ తేదీన జిల్లా బంద్ చేపడుతున్నట్లు జేఏసీ నాయకులు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్.రామచంద్రారెడ్డి, ఎస్.గోవర్థన్‌రెడ్డి, నిత్యానందరెడ్డి,ఎస్.రమణయ్య తెలిపారు.
ఆదివారం కడప నగరంలో జరిగిన సమావేశంలో ఉద్యమ కార్యాచ రణను వెల్లడించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, వంటావార్పు కార్యక్రమాలు ఉంటాయన్నారు. 6వ తేదీన మహిళలతో ర్యాలీలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమాలలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ నాయకులు హరిప్రసాద్, రవిశంకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, అమర్‌నాధ్‌రెడ్డి, ఇలియాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.