
యూరియూ కొరతకు అధికారులే కారణం
వ్యవసాయ అధికారులకు ముందు చూపు లేకపోవడంతోనే జిల్లాలో యూరియూ కొరత ఏర్పడి రైతులు ఇబ్బంది పడుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు.
నెల్లూరు(అగ్రికల్చర్): వ్యవసాయ అధికారులకు ముందు చూపు లేకపోవడంతోనే జిల్లాలో యూరియూ కొరత ఏర్పడి రైతులు ఇబ్బంది పడుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. మినీబైపాసురోడ్డులోని వ్యవసాయశాఖ జిల్లా కార్యాలయంలో జేడీ సుబ్బారావుతో మంగళవారం ఆయన యూరియూ సమస్యపై చర్చించారు. కోటంరెడ్డి మాట్లాడుతూ గత ఏడాది జిల్లాకు 96వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు.
ఈ ఏడాది అధికారులు సరిగా అంచనా వేయకపోవడంతో కేవలం 67వేల మెట్రిక్ టన్నులే వచ్చిందని వివరించారు. ఇది సరిపోదని, సీజన్ దాటిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. గత ఏడాది డిమాండ్‌ను దృష్టిలో వుంచుకొని అధికారులు సకాలంలో ప్రభుత్యానికి నివేదిక పంపివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. వచ్చిన యూరియాను సక్రమంగా పంపిణీ చేయడంలోనూ అధికారులు విఫలమయ్యారన్నారు. సొసైటీలకు కేటాయించిన ఎరువులను అధికార పార్టీ సిఫార్సు కలిగిన వారికే ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ మండల అధికారులు ఆసక్తి కనబరచడం తగదన్నారు.
ఆయకట్టు ఆధారంగా సొసైటీలకు ఎరువులు కేటాయించాలని సూచించారు. పాస్ బుక్‌లేని రైతులకు వీఆర్వో సర్టిఫికెట్ ఆధారంగా పంపిణీ చేయాలన్నారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ యూరియూకు కృత్రిమ కొరత సృష్టిస్తూ రూ.284కి అమ్మాల్సిన బస్తాను రూ.450 వరకు విక్రరుుస్తున్నారని చెప్పారు. బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహించేలా వ్యవహరించడం అధికారులకు తగదన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకుంటే జేడీఏ కార్యాలయానికి తాళానికి తాళం వేస్తామని హెచ్చరించారు.
స్పందించిన జేడీఏ సుబ్బారావు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వ్యవసాయశాఖ మంత్రి పుల్లారావుతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి ఎరువుల సమస్యను వివరించారు. కార్యక్రమంలో కలివెలపాళెం సొసైటీ అధ్యక్షుడు పార్లపల్లి వీరరాఘవరెడ్డి, ఉపాధ్యక్షుడు సుమంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాసయాదవ్, జిల్లా కార్యదర్శులు మనుబోలు సికింధర్‌రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు కారుదుంప దశరథరామయ్య యాదవ్, మల్లినేని వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.