అక్రమ కేసులకు భయపడం: పిన్నెల్లి | not afraid for illegal cases, says Pinnelli Ramakrishna Reddy | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులకు భయపడం: పిన్నెల్లి

Nov 14 2014 9:08 PM | Updated on Aug 24 2018 2:33 PM

అక్రమ కేసులకు భయపడం: పిన్నెల్లి - Sakshi

అక్రమ కేసులకు భయపడం: పిన్నెల్లి

అక్రమ కేసులకు భయపడేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాచర్ల ఎమ్మెల్నే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు.

మాచర్ల(గుంటూరు జిల్లా): అక్రమ కేసులకు భయపడేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాచర్ల ఎమ్మెల్నే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొంటామని చెప్పారు. తమపై తప్పుడు కేసులు పెట్టినవారు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అన్నారు.

శుక్రవారం మాచర్ల చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఘనస్వాగతం లభించింది. నాగార్జున్ సాగర్ నుంచి భారీ బైక్ ర్యాలీతో మద్దతుదారులు ఆయనకు స్వాగతం పలికారు. సరస్వతి పవర్, ఇండస్ట్రీస్ భూముల వ్యవహారంలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన అరెస్ట్‌పై హైకోర్టు గురువారం స్టే విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement