యువతి పట్ల అసభ్యంగా వ్యవహరించిన ఓ యువకుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.
మెదక్ టౌన్, న్యూస్‌లైన్: యువతి పట్ల అసభ్యంగా వ్యవహరించిన ఓ యువకుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలోని రాంనగర్‌లో నివాసం ఉండే యువతి(19) తన స్టడీ సర్టిఫికెట్ల నిమిత్తం సోమవారం హైదరాబాద్ వెళ్లి వస్తుండగా మెదక్ బస్సు తూప్రాన్ వద్దకు రాగానే మెదక్‌లోని పిట్లంబేస్ వీధికి చెందిన జక్కుల ప్రభాకర్ బస్సు ఎక్కి ఆ యువతి పక్క సీటులో కూర్చున్నాడు.
ఈ క్రమంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు వెనకసీటోని మెదక్‌కు చెందిన మహేందర్‌రెడ్డికి విషయాన్ని చెప్పింది. దీంతో అతను ప్రభాకర్ ను నిలదీయగా దుర్బాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. పట్టణానికి చేరుకోగానే ఆ యువతి పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేసింది. ఈ మేరకు ప్రభాకర్‌పై నిర్భయ కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.