
'దమ్ముంటే చంద్రబాబుపై కేసు పెట్టాలి'
దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడిపై కేసు పెట్టాలని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప కేసీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
కాకినాడ: దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడిపై కేసు పెట్టాలని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప ... కేసీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో చినరాజప్ప విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్ర చేసి టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్రెడ్డిని ఇరికించారని ఆరోపించారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్కు తగినంత బలం లేదన్నారు.
అయినా ఐదు ఎమ్మెల్సీ సీట్లను టీఆర్ఎస్ ఎలా గెలుచుకుందని చిన్నరాజప్ప ఈ సందర్భంగా ప్రశ్నించారు. అలాగే తెలంగాణలో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను కూడా అరెస్ట్ చేయాలని చినరాజప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఏపీ మంత్రులకు ఫోన్ల ట్యాపింగ్పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని చినరాజప్ప వెల్లడించారు.