
కర్నూలు : మల్కాపురం–ఆర్‌ఎస్ రంగాపురం సెక్షన్ మధ్య రైలు పట్టాల పక్కన అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని మహిళ (40) మృతదేహాన్ని శనివారం డోన్ రైల్వే పోలీసులు గుర్తించారు. మృతురాలు ముస్లిం మహిళగా తెలుస్తోంది. మృతదేహం వద్ద ఆమె ఫొటో తప్ప ఇతర ఆధారాలు లభించలేదు. ఆత్మహత్యకు పాల్పడిందా.. ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే కానిస్టేబుల్ గంగాధర్ తెలిపారు. మృతురాలి ఆచూకీ గుర్తించిన వారు 99663 07080కు సమాచారం అందించాలని చెప్పారు.