ఆత్మహత్య వీడియో హల్‌చల్‌ | Newly Married woman Suicide Video Hulchal | Sakshi
Sakshi News home page

ఆత్మహత్య వీడియో హల్‌చల్‌

Aug 29 2017 9:48 PM | Updated on Sep 17 2017 6:06 PM

ఆత్మహత్య వీడియో హల్‌చల్‌

ఆత్మహత్య వీడియో హల్‌చల్‌

పట్టణానికి చెందిన నవవధువు మృతికి సంబంధించిన వీడియో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. స్థానిక అలబానవీధికి చెందిన కారుకొండ రామారావు భార్య రాజేశ్వరి(20)

నెల్లిమర్ల: పట్టణానికి చెందిన నవవధువు మృతికి సంబంధించిన వీడియో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. స్థానిక అలబానవీధికి చెందిన కారుకొండ రామారావు భార్య రాజేశ్వరి(20) ఈ నెల 26న మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె అగ్నికి ఆహుతి అవుతున్న వీడియో, ఫొటోలు ప్రస్తుతం పట్టణంలోని చాలామంది ఫోన్లలో హల్‌చల్‌ చేస్తున్నాయి. బాత్‌రూమ్‌లో ఆమె కాలిపోతుండగా ఎవరో వీడియో, ఫొటోలు తీసినట్లు సమాచారం. వాటిని తన స్నేహితులకి పంపించగా పట్టణమంతా వ్యాపించాయి. కాలిపోతున్న రాజేశ్వరి కనీసం కదులుతున్నట్లుగా కూడా వీడియోలో కనిపించడం లేదు. అలాగే ఆమె ఆర్తనాదాలు చేస్తున్నట్లుగా కూడా లేదు.

దీంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందే ఎవరైనా చంపి కాల్చివేశారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజేశ్వరిని ముందే హత్య చేసి బాత్‌రూమ్‌లో పడేసి కిరోసిన్‌ పోసి నిప్పంటించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా కిరోసిన్‌ డబ్బా, అగ్గిపెట్టెను బాత్‌రూమ్‌ తలుపువద్ద పడేసినట్లు చర్చించుకుంటున్నారు.  ఒకవేళ రాజేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లైతే బాత్‌రూమ్‌ తలుపు లోపలనుంచి వేసుకుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే మంటలకు కనీసం ఆర్తనాదాలైనా చేసేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వీడియో, ఫోటోలను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement