వైఎస్‌ఆర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించండి | Newly elected Sarpanchs should follow Late YSR foot steps | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించండి

Aug 7 2013 4:04 AM | Updated on May 25 2018 9:10 PM

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఆశయాలకు అనుగుణంగా పంచాయతీ పాలన సాగించాలని నూతనంగా ఎన్నికైన సర్పంచులను వైఎస్‌ఆర్ సీపీ నాయకులు కోరారు.

 ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్:  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఆశయాలకు అనుగుణంగా పంచాయతీ పాలన సాగించాలని నూతనంగా ఎన్నికైన సర్పంచులను వైఎస్‌ఆర్ సీపీ నాయకులు కోరారు. జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మద్దతుతో  గెలుపొందిన సర్పంచులకు పార్టీ  ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం, అభినందన సభలో పలువురు మాట్లాడారు. రాష్ట్ర నాయకులు గట్టు రామచంద్రరావు, జనక్ ప్రసాద్, నల్లాని సూర్యప్రకాశ్‌రావు, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీజిసి సభ్యుడు చందా లింగయ్య, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు అనేక సూచనలు చేశారు.
 
 పార్టీ గుర్తు లేకున్నా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానం, అభివృద్ది జరుగుతుందనే నమ్మకంతో ప్రజలు గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పంచాయతీల్లో ఉన్న నిధులు మేరకు మంచి స్వపరిపాలన అందించాలని కోరారు. ఈసందర్భంగా గెలుపొందిన సర్పంచ్‌లను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement