చెత్తకుప్పలో ఆడశిశువు మృతదేహం | Newborn's body found in Dustbin | Sakshi
Sakshi News home page

చెత్తకుప్పలో ఆడశిశువు మృతదేహం

Jul 17 2015 4:08 PM | Updated on Sep 3 2017 5:41 AM

కర్నూలు జిల్లా కోస్గి మండలంలోని సజ్జెలగూడెం గ్రామ శివార్లలోని చెత్తకుప్పల్లో ఆడ శిశువు మృతదేహం వెలుగు చూసింది.

కోస్గి : కర్నూలు జిల్లా కోస్గి మండలంలోని సజ్జెలగూడెం గ్రామ శివార్లలోని చెత్తకుప్పల్లో ఆడ శిశువు మృతదేహం వెలుగు చూసింది. శుక్రవారం మధ్యాహ్నం కొందరు మహిళలు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. శిశువు వయసు ఒక రోజు ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement