అమ్మవారి సేవలో కొత్త గవర్నర్‌ | The New Governor Of Andhra Pradesh Biswabhushan Harichandan Has Visited Thiruchanur Sri Padmavati Ammavaru | Sakshi
Sakshi News home page

అమ్మవారి సేవలో కొత్త గవర్నర్‌

Jul 24 2019 11:08 AM | Updated on Jul 24 2019 11:08 AM

The New Governor Of Andhra Pradesh Biswabhushan Harichandan Has Visited Thiruchanur Sri Padmavati Ammavaru - Sakshi

సాక్షి, తిరుచానూరు(భాకరాపేట): తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్‌ కొత్త గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు దర్శించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం అమ్మవారి దర్శనానికి వచ్చిన  గవర్నర్‌ దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈఓ అని ల్‌కుమార్‌ తిరుపతి జేఈఓ పి.బసంత్‌కుమార్, సీవీ ఎస్‌ఓ గోపీనాథ్‌జెట్టి, తిరుపతి ఆరీఓ కనకనరసారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈఓ ఝాన్సీరాణి, రూరల్‌ తహసీల్దార్‌ కిరణ్‌కుమార్, ఆలయ అర్చక బృందం స్వాగతం పలికారు. తొలుత ఆలయంలో ధ్వజ స్తం భానికి మొక్కుకొని, కుంకుమార్చన సేవలో గవ ర్న ర్‌ దంపతులు పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదానలను అందజేశారు. 

బాధ్యతతో పనిచేస్తా : గవర్నర్‌
శ్రీపద్మావతి అమ్మవారి దర్శనానంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మాట్లాడుతూ శ్రీవారి, అమ్మవారి ఆశీస్సులతో తనకు ఈ పదవి లభిం చిందని, బాధ్యతతో విధులు నిర్వహిస్తానన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని  అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.  తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్,  పలువురు డీఎస్పీలు, సీఐలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. 

విమానాశ్రయంలో సాదర స్వాగతం
రేణిగుంట: రాష్ట్ర నూతన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు మంగళవారం రేణిగుంట విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. ఆయ న తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం ఉద యం 11.40గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎన్‌.భరత్‌గుప్తా, అర్బన్‌ ఎస్‌పీ అన్బురాజన్, తిరుపతి నగరపాలక కమిషనర్‌ గిరీషా, టీటీడీ జేఈఓ బసంత్‌కుమార్, మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కీర్తి చేకూరి, తిరుపతి ఆర్‌డీఓ కనకనరసారెడ్డి, తిరుపతి డీఎఫ్‌ఓ సునీల్‌కుమార్‌రెడ్డి, సెట్విన్‌ సీఈఓ లక్ష్మి, తహసీల్దార్‌ విజయసింహారెడ్డి, డీఎస్‌పీ చంద్రశేఖర్, సీఐ అంజూయాదవ్‌ తదితరులు పుష్పగుచ్ఛం అం దించి స్వాగతం పలికారు. 

సాయంత్రం వీడ్కోలు
తిరుమల శ్రీవారి దర్శనానంతరం గవర్నర్‌ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఆయనకు జిల్లా కలెక్టర్‌ నారాయణ్‌ భరత్‌గుప్తా, డీఐజీ క్రాంతిరాణా టాటా, పలువురు జిల్లా అధికారులు వీడ్కోలు పలికారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement