సరదాగా నదిలోకి దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తూ జారిపడి మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లా అమరావతి కరకట్ట సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది.
గుంటూరు : సరదాగా నదిలోకి దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తూ జారిపడి మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లా అమరావతి కరకట్ట సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తాడేపల్లి మున్సిపాలిటి పరిధిలోని బ్రహ్మానందపురానికి చెందిన పగడాల నాగరాజు(31) నావికాదళంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్యనే సెలవుపై సొంత ఊరికి వచ్చాడు.
ఈ క్రమంలో మిత్రులతో కలిసి శనివారం రాత్రి అమరావతి కరకట్టకు వెళ్లిన నాగరాజు ప్రమాదవశాత్తు జారిపడి నదిలో గల్లంతయ్యాడు. దీంతో స్నేహితులు అతని మృతదేహం కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఆదివారం ఉదయం మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారాంభించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.