గ్రేటర్లో విలీనాన్ని వ్యతిరేకించిన నార్సింగ్ గ్రామస్థులు | Narsingi villagers opposse to govt decision | Sakshi
Sakshi News home page

గ్రేటర్లో విలీనంపై నార్సింగ్ గ్రామస్థులు ఆగ్రహం

Sep 3 2013 11:12 AM | Updated on Sep 1 2017 10:24 PM

నగర శివారులోని నార్సింగ్ గ్రామాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేయడాన్ని ఆ గ్రామస్థులు ముక్త కంఠంతో ఖండించారు.

నగర శివారులోని నార్సింగ్ గ్రామాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం చేయడాన్ని ఆ గ్రామస్థులు ముక్త కంఠంతో ఖండించారు. నార్సింగ్ పంచాయతి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మంగళవారం ఉదయం నార్సింగ్ చేరుకున్నారు.

 

అయితే అధికారుల ప్రయత్నాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి గ్రామస్థులను శాంతపరిచేందుకు ప్రయత్నించారు. అయితే స్థానికుల అభిప్రాయాన్ని తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నార్సింగ్ గ్రామస్థులు మంగళవారం బంద్కు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగర శివారుల్లోని కొన్ని గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement