‘చెప్పడం కాదు.. చేసి చూపిస్తాం’ | N Balakrishna tour in anantapur district | Sakshi
Sakshi News home page

‘చెప్పడం కాదు.. చేసి చూపిస్తాం’

Jun 29 2016 11:19 AM | Updated on Jun 1 2018 8:39 PM

సినిమాల్లో చెప్పడానికే పరిమితం కాదు.. దాన్ని చేసి చూపించే సత్తా తమకే ఉందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.

 హిందూపురం : సినిమాల్లో చెప్పడానికే పరిమితం కాదు.. దాన్ని చేసి చూపించే సత్తా తమకే ఉందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురం నియోజకవర్గంలో మూడురోజుల పర్యటనలో భాగంగా రెండోరోజైన మంగళవారం పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లిలో నాలుగు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజలు చేశారు.  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఏఎంఎస్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేస్తున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement