సివిల్స్‌లో మెరిసిన మాజీ ఎమ్మెల్యే మనువడు | musharraf ali got 80 rank in UPSC | Sakshi
Sakshi News home page

సివిల్స్‌లో మెరిసిన మాజీ ఎమ్మెల్యే మనువడు

Jun 13 2014 3:12 AM | Updated on Sep 2 2017 8:42 AM

సివిల్స్‌లో మెరిసిన మాజీ ఎమ్మెల్యే మనువడు

సివిల్స్‌లో మెరిసిన మాజీ ఎమ్మెల్యే మనువడు

నంద్యాల మాజీ ఎమ్మెల్యే, దివంగత నబీ సాహెబ్ మనువడు ముషఫ్ అలి ఫారుకి సివిల్స్‌లో 80వ ర్యాంకును సాధించారు.

నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: నంద్యాల మాజీ ఎమ్మెల్యే, దివంగత నబీ సాహెబ్ మనువడు ముషఫ్ ్రఅలి ఫారుకి సివిల్స్‌లో 80వ ర్యాంకును సాధించారు. దీంతో నంద్యాలలోని మాజీ ఎమ్మెల్యే నబీ సాహెబ్ ఇంట్లో గురువారం బంధువులు సంబరాలను చేసుకున్నారు. నబీ సాహెబ్ కుమార్తె రహ్మతున్నిసా కుమారుడు ముషఫ్ ్రఅలి. ఈయన తండ్రి ముర్తుజ ఫారుకి హైదరాబాద్‌లోని ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్ హోదాలో పని చేస్తున్నారు. ముషఫ్ ్రఅలి ఫారుకి విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే సాగింది.
 
టెన్త్ వరకు హైదరాబాద్ హైస్కూల్‌లో, ఇంటర్ శ్రీ చైతన్య కాలేజిలో, ఇంజినీరింగ్ బంజారా హిల్స్‌లోని ఎంజె.కాలేజిలో చదివారు. తర్వాత ఐఐటీలో సీటు సాధించి చెన్నైలో చదివారు. తర్వాత బెంగుళూరులోని ఇంటెల్ కంపెనీలో కంప్యూటర్ చీఫ్ డిజైనర్‌గా పని చేశారు. ఏడాది తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. దాదాపు ఏడు నెలలు కష్టపడి చదివారు.
 
దీంతో 80వ ర్యాంకును సాధించారు. ఆత్మవిశ్వాసం, ఖచ్చితమైన లక్ష్యం, నిరంతర శ్రమతో తాను సివిల్స్‌లో ర్యాంకు సాధించానని చెప్పారు. రోజుకు 8 గంటలు చదివేవాడినని, తల్లిదండ్రులు, స్నేహితులు ప్రోత్సహించారని చెప్పారు. ఐఏఎస్ చదివి పేద బడుగు, బలహీన వర్గాల వారికి చేయూతనివ్వాలనేది లక్ష్యమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement