టీడీపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు

Murder Attempt On Ys Jagan High Court dismissed The AP Government Petition - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన కేసులో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం స్టేను నిరాకరిస్తూ కేసును కొట్టివేసింది. ఈ నెల 30లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటివరకు చేసిన దర్యాప్తు వివరాలను కోర్టు ముందు పెట్టాలని ఎన్‌ఐఏకు ఆదేశాలు జారీ చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top