మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి | Municipal Election Counting Arrangements in Anantapur district | Sakshi
Sakshi News home page

మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

May 11 2014 1:50 PM | Updated on Aug 29 2018 6:13 PM

జిల్లాలో మున్సిపల్, జడ్పీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ వెల్లడించారు.

జిల్లాలో మున్సిపల్, జడ్పీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ వెల్లడించారు. ఆదివారం ఆయన అనంతపురంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వీడియో చిత్రీకరణ మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుపుతున్నట్లు తెలిపారు.

జిల్లాలోని ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలలో పోలీస్ భద్రత కొనసాగుతుందని చెప్పారు. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం విజయోత్సవర ర్యాలీలు నిషేధించినట్లు వెల్లడించారు. ఆ విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ కూడా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement