ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ జాబ్ మేళా నిర్వహించారు.
ఒంగోలు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో దాదాపు 47 కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్య్వూలు నిర్వహించారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకునేందుకు జిల్లా నుంచి భారీగా నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగుల స్పందన చూస్తే జిల్లా ఎంత వెనకబడిందో అర్ధమౌతోందన్నారు. పరిశ్రమలు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ధ్యాస నిరుద్యోగుల పట్ల లేదని తెలిపారు.