'ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజయం మాదే' | mp mekapati rajamohan reddy criticize the cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజయం మాదే'

Jul 29 2017 4:40 PM | Updated on Oct 19 2018 8:10 PM

'ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజయం మాదే' - Sakshi

'ఎన్ని జిమ్మిక్కులు చేసినా విజయం మాదే'

ఎన్నికల ప్రక్రియను సీఎం చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు.

నెల్లూరు: ఎన్నికల ప్రక్రియను సీఎం చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు. నంద్యాల ఉపఎన్నిక కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నంద్యాలలో వైఎస్ఆర్సీపీదే విజయం అని ఆయన స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి విజయం కాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక హడావిడి నెలకొన్న విసయం తెలిసిందే.  ఎన్నికల కమిషన్‌  గురువారం నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్‌ ను విడుదల చేసింది. వచ్చేనెల 23వ తేదీన ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఆగస్ట్‌ 5. నామినేషన్ల పరిశీలనకు గడువు వచ్చే నెల 7వ తేదీ. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 9 తుది గడువు. ఇక ఆగస్టు 23న పోలింగ్‌, 28న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement