'తెలంగాణకు, ఏపీకి న్యాయం జరగలేదు' | MP Gutta sukhendar reddy blames NDA railway budget | Sakshi
Sakshi News home page

'తెలంగాణకు, ఏపీకి న్యాయం జరగలేదు'

Jul 8 2014 2:10 PM | Updated on Sep 2 2017 10:00 AM

'తెలంగాణకు, ఏపీకి న్యాయం జరగలేదు'

'తెలంగాణకు, ఏపీకి న్యాయం జరగలేదు'

రైల్వే బడ్జెట్పై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పెదవి విరిచారు.

హైదరాబాద్ : రైల్వే బడ్జెట్పై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పెదవి విరిచారు. ఎన్డీఏ రైల్వే బడ్జెట్ రైల్వేశాఖను ప్రైవేటీకరణ చేసే విధంగా ఉందని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు కానీ, ఆంధ్రప్రదేశ్కు గానీ ఎలాంటి న్యాయం జరగలేదని గుత్తా వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్కు జోనల్ స్టేషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా తేలేదని ఆయన అన్నారు. ఎన్డీయే మిత్రపక్ష టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల కోసం ఎలాంటి ప్రతిపాదనలు తీసుకురాకపోవటం విడ్డూరంగా ఉందని గుత్తా ఎద్దేవా చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement