చెత్త కదిలింది

చెత్త కదిలింది


► రామాపురం వాసులతో చర్ఛలు సఫలం

► 22 వరకు చెత్త తరలింపునకు అనుమతి

► పేరుకుపోయిన వ్యర్థాలకు మోక్షం

► తరలిన 760 మెట్రిక్‌ టన్నుల చెత్త

► ప్రత్యామ్నాయంపై  తర్జన భర్జన  




తిరుపతి నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. నాలుగు రోజులుగా పేరుకుపోయిన చెత్త కదిలింది. సీ రామాపురం ప్రజలు ఈనెల 22వరకూ అనుమతించడంతో అధికారులు హమ్మయ్య అనుకున్నారు. తమ బతుకులను ఇబ్బందిపాల్జేసే చెత్తను ఇక్కడ వేయవద్దంటూ సి.రామాపురం గ్రామస్తులు డంపిం గును అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో నగరంలో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. గ్రామస్తుల అంగీకరించిన వెం టనే శనివారం మధ్యాహ్నం నుంచి చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించారు.



తిరుపతి తుడా/రామచంద్రాపురం: తిరుపతి చెత్త కదిలింది. నాలుగు రోజులుగా ఎక్కడి చెత్త అక్కడ నిలిచిన సంగతి తెలిసిందే. 760 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. శుక్రవా రం సాయంత్రం కొద్దిపాటి వర్షానికి ఈ చెత్త నుంచి దుర్వాసన రావడంతో నగర వాసులు అసౌకర్యానికి లోనయ్యారు. సి.రామాపురంలోని కార్పొరేషన్‌ డంపింగ్‌ యార్డ్‌లో చెత్త తరలింపును గ్రామస్తులు అడ్డుకోవడంతో ఈ సమస్య నెలకుంది.



గ్రామస్తులు ఎందుకు వద్దన్నారంటే..

రామచంద్రాపురం మండలం రామాపురం పక్కనే ఉన్న డంపింగ్‌ యార్డుకు తిరుపతిలోని చెత్తాచెదారం, ఇతరత్రా వ్యర్థపదార్థాలను 12 సంవత్సరాలుగా తరలిస్తున్నారు. కంపోస్టు లోడ్‌తో వెళ్లే మున్సిపల్‌ వాహనాలన్నీ ఈ ఊరు మీదగానే యార్డుకు వెళతాయి. అయితే తమ గ్రామం పక్కనున్న డంపింగ్‌ యార్డు వల్ల త్వరగా రోగాల బారిన పడుతున్నామని, ఎంతో మందికి డెంగీ జ్వరాలు కూడా వచ్చాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారు చెత్త తరలింపును అడ్డుకున్నారు. దీని వల్ల గడచిన 4రోజుల్లో 760 మెట్రిక్‌ టన్నుల చెత్త తిష్టవేసింది. సమస్య జఠిలం కావడంతో శనివారం  ప్రజాప్రతినిధులు సమావేశమై తాత్కాలిక పరి ష్కారం చూపారు. దీంతో చెత్త కదిలింది.



22 వరకే గడువు..

సీ.రామాపురం వద్ద డంపింగ్‌యార్డును తరలించేంతవరకు ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామని శాసన సభ్యుడు డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ శివప్రసాద్‌ చెప్పారు. శనివారం రామాపురంలో గ్రామస్తులతో ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. సమస్య పరిష్కారానికి చర్చించారు. ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యేతో చర్చించి సమస్య పరిష్కారానికి మున్సిపల్‌ అధికారులకు కొంత గడువు ఇప్పిస్తే మంచిదని కోరారు. దీనిపై స్పందించిన చెవిరెడ్డి తిరుపతి ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొంత గడువిద్దామని అక్కడి ప్రజలను కోరారు.



22వరకు చెత్త తరలింపునకు అనుమతిద్దామని చెప్పారు. తర్వాత తరలింపు జరగనివ్వమన్నారు. 2012లో మూడు నెలల్లో డంపింగ్‌ యార్డును వేరే ప్రాంతానికి మారుస్తామని అధికారులు లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చి స్పందిం చకుండా ప్రజలను ఇబ్బంది పెట్టుతున్నారన్నారు. ప్రత్యామయంగా డంపింగ్‌ యార్డును వేరే ప్రాంతానికి మార్చుకోకపోతే పార్టీలకతీతంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీంతో గ్రామ ప్రజలు శాంతించి ఎమ్మెల్యే ప్రతిపాదనకు అంగీకరించారు. ఆందోళన తాత్కాలికంగా విరమించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top