లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల సాయంతో చేర్యాల మండలంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి ఆదివారం గోదావరి జలాలను పంప్ చేశారు.
చేర్యాల, న్యూస్‌లైన్: లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల సాయంతో చేర్యాల మండలంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి ఆదివారం గోదావరి జలాలను పంప్ చేశారు. ఈ సందర్భంగా తపాస్‌పల్లి రిజర్వాయర్ వద్ద రాష్ట్ర ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరి జలాలతో చేర్యాల ప్రాంత రైతులకు న్యాయం చేశామన్నారు. చేర్యాల మండలంలోని సుమారు 67 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు సరఫరా చేస్తామన్నారు.
ఈ ప్రాంత రైతులకు గోదావరి నీళ్లనందించేందుకు భగీరథ ప్రయత్నం చేశామన్నారు. కాకతీయుల కాలంలో కాల్వతో గోదావరి నీటిని అందించారని చెప్పుకోవడమే మనం చూశామని, ఇప్పుడు ఆ కలనేరవేరిందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ బి.వెంకటేశ్వర్లు, ఈఈ కె.వీరయ్య, డీఈ శ్రీనివాస్‌రెడ్డి, సాయిలు, శారదతోపాటు గ్రామ సర్పంచ్ వీజేందర్, ఈగ యాదయ్య, మాజీ సర్పంచ్ నాగమల్ల భూలక్ష్మి, వివిధ పార్టీల నాయకులు మెరుగు శ్రీనివాస్, డీసీసీ ఉపాధ్యక్షులు ముస్త్యాల కిష్టయ్య, కొమ్ము రవి, నాగమల్ల బిక్షపతి, ఉడుముల భాస్కర్‌రెడ్డి, ఉట్లపల్లి శ్రీనివాస్, నాగమల్ల సత్యనారాయణ, ముస్త్యాల యాదగిరి గొల్లపల్లి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.