ఆయన నిద్రపోరు.. మమ్మల్ని నిద్రపోనివ్వరు: వెంకయ్య | modi never sleeps, will not allow us to sleep, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

ఆయన నిద్రపోరు.. మమ్మల్ని నిద్రపోనివ్వరు: వెంకయ్య

Nov 17 2014 11:58 AM | Updated on Aug 15 2018 2:20 PM

ఆయన నిద్రపోరు.. మమ్మల్ని నిద్రపోనివ్వరు: వెంకయ్య - Sakshi

ఆయన నిద్రపోరు.. మమ్మల్ని నిద్రపోనివ్వరు: వెంకయ్య

ఓ వ్యక్తి కారణంగా కేంద్ర మంత్రులంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. ఈ విషయాన్ని చెప్పింది కూడా వాళ్లూ వీళ్లూ కారు. స్వయానా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు.

ఓ వ్యక్తి కారణంగా కేంద్ర మంత్రులంతా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట. ఈ విషయాన్ని చెప్పింది కూడా వాళ్లూ వీళ్లూ కారు. స్వయానా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురించి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మోదీ తాను నిద్రపోవట్లేదని, తమనూ నిద్రపోనివ్వడం లేదని చెప్పారు. ఆయన తెల్లవారుజామునే నిద్ర లేస్తారని, ఇక అప్పటి నుంచి తమకు కూడా నిద్ర ఉండట్లేదని అన్నారు.

అయినా దాన్ని కూడా తాము ఆస్వాదిస్తున్నామని, ప్రజల కోసం, సామాన్యుల జీవనాన్ని మెరుగు పరిచేందుకు పని చేయడం జీవితంలో అన్నింటికంటే చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు కావాలంటే ఐదేళ్లు పడుతుందని కొంతమంది మంత్రులు అంటే.. ప్రధాని మాత్రం ఒక్క ఏడాదిలోనే పూర్తి చేయాలని గట్టిగా నిర్దేశించారన్నారు. ఇప్పటికి కేవలం 7 వారాల్లోనే దాదాపు 7 కోట్ల మంది జనధన యోజన కింద ఖాతాలు పొందారని వెంకయ్యనాయుడు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement