టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యం | MLA Amjad Basha Comments On TDP Govt | Sakshi
Sakshi News home page

టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యం

Jul 26 2018 9:00 AM | Updated on Jul 26 2018 9:00 AM

MLA Amjad Basha Comments On TDP Govt - Sakshi

ప్రకాష్‌నగర్‌లో సిమెంటు రోడ్డు పనులకు భూమిపూజ చేస్తున్న  మేయర్‌ సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా

కడప కార్పొరేషన్‌: తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది శూన్యమని నగర మేయర్‌ కె. సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా విమర్శించారు. స్థానిక 13, 14 డివిజన్ల పరిధిలోని ప్రకాష్‌నగర్‌లో రూ.30లక్షల ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో చేపట్టిన సిమెంటు రోడ్లకు వారు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది మాటల ప్రభుత్వమే తప్పా చేతల ప్రభుత్వం కాదన్నారు. ఏ హామీలు నెరవేర్చని టీడీపీ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందని తెలిపారు. కడప నగరంలో అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులు, కార్పొరేషన్‌ సాధారణ నిధులతోనే చేపడుతున్నామని వివరించారు.

సీఎం చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వకుండా ప్రజల్లో వారికి చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రకాష్‌నగర్‌లో కాలువలు నిర్మించి డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని స్థానిక మహిళలు వారి దృష్టికి తీసుకొచ్చారు. డీఈ  కరిముల్లాఖాన్,  కార్పొరేటర్‌ మాచవరం రామలక్ష్మణ్‌రెడ్డి, 14వ డివిజన్‌ కార్పొరేటర్‌ కె. బాబు, నాయకులు కిరణ్, షఫీ, ఏ. బాబు, చరన్, నాయక్, సాయిరాం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement