చైల్డ్‌లైన్‌ కార్యాలయంలో తప్పిపోయిన బాలలు | Missing children at the childline office | Sakshi
Sakshi News home page

చైల్డ్‌లైన్‌ కార్యాలయంలో తప్పిపోయిన బాలలు

May 2 2018 10:54 AM | Updated on May 2 2018 10:54 AM

Missing children at the childline office - Sakshi

విజయనగరం ఫోర్ట్‌ : తప్పిపోయిన బాలలు నలుగురు చైల్డ్‌లైన్‌ 1098 సంస్థ కార్యాలయానికి చెంతకు చేరారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం టి.బరంపురానికి చెందిన కుంది రాజ్‌కుమార్‌  అనే పదేళ్ల బాలుడు, కుంది కార్తీక్‌ అనే ఆరేళ్ల బాలుడు, రోహిత్‌ బెహరా అనే 11 ఏళ్ల బాలుడు, అక్షయ్‌ బెహరా అనే 12 ఏళ్ల బాలుడు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని వన్‌టౌన్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ సత్యమోహన్‌ చైల్డ్‌లైన్‌ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చైల్డ్‌లైన్‌ సభ్యులు బాలలు నలుగురిని చైల్డ్‌లైన్‌ కార్యాలయానికి తీసుకుని సంరక్షించారు. కార్యాలయంలో చైల్డ్‌లైన్‌ కో–ఆర్డినేటర్‌ ఎస్‌.రంజిత, వరలక్ష్మి, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు 

Advertisement
 
Advertisement
Advertisement