నెల్లూరు జిల్లాల్లో ఆదివారం ఉదయం కూడా మరోసారి స్వల్పంగా భూమి కంపించింది.
నెల్లూరు: నెల్లూరు జిల్లాల్లో ఆదివారం ఉదయం కూడా మరోసారి స్వల్పంగా భూమి కంపించింది. ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు మండలాల్లో భూప్రకంపనలు రావటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లల్లోని వస్తువులు కింద పడిపోయాయి. గత 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో 4 సార్లు భూమి కంపించింది. శనివారం ఉదయం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని స్వల్ప భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.